నిరంతరం ప్రకాశించే ధృవతార మన

అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా పుట్టిన రోజు నేడు

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించారు

ఆమె స్కూల్ విద్యను కర్నాల్ లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేశారు పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు

1984లో అమెరికాలోని టెక్సాన్  విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు 986లో చావ్లా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో తన పీహెచ్ డీ చేశారు

1988లో నాసాకు చెందిన అమెస్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగంలో చేరారు అలా అంచలంచెలుగా ఎదుగుతూ నాసాకు వైస్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు

1991 ఏప్రిల్ లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది తరువాత ఆమె నాసా ఆస్ట్రోనాట్ కార్ప్ కు దరఖాస్తు చేసుకున్నారు

చావ్లా మొట్టమొదటి అంతరిక్ష మిషన్ Sts 87 అంతరిక్ష నౌకలో 1997 నవంబర్ 18న ప్రారంభమైంది  ఆమెతో పాటు ఆరుగురు వ్యోమగాములు Sts 87 నౌకలో ప్రయాణించారు

2003 జనవరిలో Sts107 అంతరిక్ష నౌకలో ఆమె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజలు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు

2003 ఫిబ్రవరి 1న అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు

ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక కొలంబియాలో షెడ్యూల్ ల్యాండింగ్ కు 16 నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో కుప్ప కూలిపోయింది దీంతో ఆమె 40 ఏళ్ల వయస్సులోనే దుర్మరణం పాలయ్యారు